NZB: రైలులో మొబైల్ ఫోన్ చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ద్వారక నగర్‌కు చెందిన సయ్యద్ మాజీద్ రైలులో సెల్‌ఫోన్ దొంగతనం చేశాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి అనుమానాస్పదంగా మాజీద్ కన్పించడంతో అదుపులోకి తీసుకున్నారు.