BHPL: టేకుమాట్ల మండలం పంగిడి పల్లి గ్రామంలో గ్రామ ముదిరాజ్లు నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.