NLG: ప్రజా పాలన.. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా CDMA ఆదేశాల మేరకు, ఇవాళ నల్లగొండ పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘చెట్ల కోసం మహిళలు’ కార్యక్రమంను 35వ డివిజన్లో ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొక్కలు నాటి, చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ మంగమ్మ ఉన్నారు.