వరంగల్ జిల్లాలో గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి పల్లె లక్ష్మణ్ గౌడ్ నాయకత్వంలోని తెలంగాణ గౌడ సంఘం ప్రతినిధులు శుక్రవారం ఆప్కారి శాఖ, బీసీ వెల్ఫేర్ అధికారులకు మెమోరాండం సమర్పించారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలని, గీతా కార్మికులకు సభ్యత్వాలు జారీ చేయాలని, సేఫ్టీ మోకులు అందించాలని కోరారు.