TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి పంచమీ తీర్థం మంగళవారం నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటల తర్వాతే పుష్కరిణిలోకి అనుమతిస్తారు. జడ్పీ స్కూల్, పూడి సర్కిల్, నవజీవన్ ఆసుపత్రి సమీపంలోని క్యూలైన్ ద్వారా కోనేరులోకి వెళ్లాలి. స్నానాల తర్వాత వేరే దారిలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది.