సంగారెడ్డి: పట్టణంలో కురిసిన భారీ వర్షానికి అస్తబల్ FRS ప్రాంతాల ఇళ్లలోకి వర్షం నీరు చేరాయి. దీంతో అక్కడి కాలనీ ప్రజలు అధికారులకు, నాయకులకు సమాచారం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, అరుణ్ అక్కడికి చేరుకొని మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి జేసీబీతో కాలువలకు దారిచేసి నీరు దిగువకు వదిలిపెట్టారు.