మేడ్చల్: బోడుప్పల్ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే బోడుప్పల్ నుంచి హైటెక్ సిటీ, విప్రో లాంటి ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈ మేరకు కసరత్తు ప్రారంభమైనట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడంపై కృషి చేస్తున్నామన్నారు.