ఖమ్మం: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో భేటీ అయ్యారు. జిల్లాలోని పలు ఆలయాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను రాయల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం పై నియోజకవర్గ, మండల స్థాయి సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.