WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఐదో వార్డులోని కేజీబీవీ పక్క గల్లీలో సీసీ రోడ్డు లేక చాలా ఏళ్లుగా ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మొత్తం గుంతల మయంగా మారి వర్షం కురిస్తే నీరు చేరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 100 మీటర్ల వరకు దారి లేకపోవడంతో ఆ కాలనీలో ఉండే 30 కుటుంబాల ప్రజలు రాత్రి వేళల్లో వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు.