MLG: ములుగు మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, భానోత్ రవిచందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారుల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.