NLG: గల్ఫ్ యుద్ధంను దృష్టిలో ఉంచుకుని, చమురు సంస్థల ఏజెన్సీలు అతిగా ప్రవర్తిస్తూ అత్యవసర సేవలకు విఘాతం కలిగిస్తే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రఘునందన్ హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరంలేదని ఇప్పటికే చమురు సంస్థలు స్పష్టం చేశాయని గుర్తు చేశారు.