BHNG: ప్రతి రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని కేజీబీవీ స్కూల్, కాలేజీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకి వంట చేసిన కర్రీస్ను, భోజనాన్ని, వంటగదిని పరిశీలించారు.