WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో మున్సిపల్ కార్యాలయాల వద్ద శుక్రవారం బీజేపీ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీలోని 10వ వార్డులో అనర్హులకు ఇళ్లు కేటాయించారని వారు ఆరోపించారు. అర్హులకు ఇల్లు ఇవ్వాలని లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.