GDWL: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గద్వాల క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తానని తెలిపారు. తనను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.