KMR: ఎమ్మెల్యే పీఏల తీరుతో రాజీనామా చేసి కలకలం రేపిన సదాశివనగర్ సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం తన సోదరికి సంబంధించిన సీఎం సహాయక నిధి చెక్కును చించివేసి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. చికిత్సకు రూ.32 లక్షలు ఖర్చు కావడంతో కేవలం రూ.60 వేలు మాత్రమే రావడంతో ఫైర్ అయ్యారు.