BDK: మద్యం మత్తులో భార్యతో గొడవపడి పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన దమ్మపేట మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన చిన్న గొల్లగూడెం గ్రామంలోని వ్యవసాయ కూలీ ప్రసాద్ భార్య నాగమణితో గొడవపడి పురుగుల మందు తాగాడు. దీనిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.