MNCL: మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో శనివారం అర్థరాత్రి ఒక మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు చైన్‌ను ఓ ఆగంతకుడు అపహరించాడు. ఈ ఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.