GDWL: అయిజ పట్టణంలోని భరత్ నగర్ కాలనీలో వర్షాల కారణంగా వీధుల్లో నీరు నిలిచిపోవడంపై బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలతో కలిసి కాలనీని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలు బురదలో నడుస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని, ఇది వారి విద్య, ఆరోగ్యానికి ముప్పు అని పేర్కొన్నారు.