KMM: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు పొనుకుల సుధాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ పాలేరు డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు పక్క భవనాలను నిర్మించాలన్నారు.