అనంతపురం జిల్లా వైసీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి అందించిన సేవలు మరిచిపోలేనివని అన్నారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.