MHBD: డోర్నకల్ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధిపై నిర్లక్ష్యం వీడాలని, జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి బసు, మధు హెచ్చరించారు. ఇవాళ డోర్నకల్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో 14 మందితో నూతన మండల కమిటీ ఏర్పాటైంది. రాకేష్ అధ్యక్షుడిగా, ఉదయ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.