NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయం వద్ద శుక్రవారం ఏఎస్సై వెంకట్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాట్సప్‌లో వచ్చే లింక్‌లు తెరవొద్దని, ఏ పోలీస్ అధికారి నేరుగా వీడియో కాల్స్ చేయరని తెలిపారు. ‘డిజిటల్ అరెస్టు’ కాల్స్ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్లకు బలం అవుతున్నాయని పేర్కొన్నారు.