BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేగా నిధులతో రూ.12 లక్షల అంచనాతో నిర్మించే ఈ భవన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.