NZB: విద్యుత్ శాఖ ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో గతంలో జరిగిన పనులపై వరంగల్ నుంచి వచ్చిన సీఈ స్థాయి అధికారి విచారణ చేపట్టారు. గతంలో పని చేసిన డీఈ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై ఈ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కాంట్రాక్టర్లు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బందితో పాటు ఇటీవల పెర్కిట్‌కు సంబంధించిన ఏఈని కూడా విచారించినట్లు తెలిసింది.