కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 1626.06 అడుగులకు చేరింది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి నిల్వ 80.003 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 13,420 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 13,533 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.