VKB: జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. పెద్దేముల్ మండలంలో అత్యధికంగా 65.7 మి.మీ, అత్యల్పంగా నవాబుపేట మండలంలో 5.7మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.