MNCL: వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యసేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, వంద శాతం గర్భవతుల నమోదు, టీకాలు ఇప్పించడం, కీటక జనిత వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి కిట్లు అందించారు.