KMM: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్లో లేకుండా పరిష్కరించాలన్నారు.