MDCL: నాగోల్ సాయినగర్ కాలనీలో భారీ వృక్షం కూలి 11 కేవీ సాయినగర్ ఫీడర్పై పడటంతో మూడు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.