HYD: వర్షం వస్తే అమీర్‌పేటలో ఆందోళన తప్పదు. జూబ్లీహిల్స్, గాయత్రీహిల్స్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, మదురానగర్, శ్రీనివాసనగర్ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు ఇక్కడే చేరి నిలిచిపోతుంది. 10 సెంటీమీటర్ల వర్షం పడితేనే రహదారులు జలమయం అవుతాయి. అయితే ఈసారి ఆ సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. డీ సిల్టింగ్ ద్వారా 45 ట్రక్కుల మట్టి తరలించింది.