SDPT: ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం జనగాం డిపోకు చెందిన బస్సులో ఎంఏ జావిద్, ఎస్కే షమీం సిద్దిపేటలో బస్సు ఎక్కి దుద్దెడ మసీదు వద్ద బస్సు ఆపమని అడిగారు. హైవేపై ఆపడం కుదరదని డ్రైవర్ బదులిచ్చాడు. దీంతో డ్రైవర్ నరసింహా రెడ్డిని దుర్భాషలాడుతూ దాడి చేశారు.