NZB: నవీపేట్ మండలం శ్రీరామ్ తండాకు చెందిన యువతిపై మిస్సింగ్ కేసు నమోదైంది.ఈ మేరకు ఎస్సై తిరుపతి ఇవాళ వివరాలను తెలిపారు. విస్లావత్ అనూష, వయస్సు: 20 సం.రాలు. ఈమె తల్లి లత ఈనెల 16న బోధన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు కొడుకు ఆనంద్‌ను కలవడానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికొచ్చేసరికి అనూష ఇంట్లో కన్పించలేదు. దీంతో స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. మిస్సింగ్ కేసును నమోదు చేశారు.