NGKL: జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ ఆదేశాల మేరకు, జిల్లా షి టీం ఇంచార్జ్ విజయలక్ష్మి ZPHS శిరసవాడలో పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినిలు, మహిళలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.