PDPL: సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల నగర్, శాస్త్రి నగర్ ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సేవలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ఏఈ కిషోర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూసాల 11 KV ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు తొలగించే పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.