RR: ఫరూఖ్ నగర్ మండలంలోని లింగారెడ్డి గూడా గ్రామంలో సీ.ఆర్.ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన 10 లక్షలు, డీఎంఎఫ్టీ నిధులు ద్వారా మంజూరైన 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు పనులకు ఈరోజు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.