PDPL: రామగుండం నగరంలో ఎక్కడా చీకటి ప్రదేశాలు లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రూ.1.30 కోట్లతో నగరంలో డార్క్ స్పాట్ లేకుండా 300 విద్యుత్ స్తంభాలు, 2 వేల లైట్లను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రాబోయే వేసవిలో తాగు నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టామన్నారు.