HYD: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆదివారం మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున బోనాలతో తరలివస్తున్నారు. అంగరంగ వైభవంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తి, ఉత్సాహంతో అడుగులు వేస్తున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోతున్నాయి. మహిళలు, యువతులు సంపద్రదాయం ఉట్టిపడేలా బోనాల పండగ జరుపుకుంటున్నారు.