ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నేర్పల్లి గ్రామంలోని MPPS పాఠశాలను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.