BDK: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యి వచ్చే నెల 12న ముగుస్తాయి. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా చైత్ర మాసంలో నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన రోజు శ్రీరామ నవమి. ఈ పవిత్రమైన రోజున శ్రీసీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు.