MBNSR: మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేట్, వీరభద్ర కాలనీలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీజనల్ వ్యాధుల గురించి వివరించారు. కుమార్ వాడి UPHC ANM మంజూల, మున్సిపల్ అధికారుల సమన్వయంతో కలిసి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. డెంగీ, మలేరియాల గురించి ఇంటింటికి వెళ్లి వీధి ప్రజలకు తెలిపారు. నీటిని ఇంటి పరిసరాలలో నిల్వ ఉండకుండా తగిన శుభ్రతలను పాటించాలని అన్నారు.