WGL: మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శనివారం “సెల్ ఫోన్ రికవరీ మేళా”లో, సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేసిన యజమానుల ఫోన్లను గుర్తించి, వరంగల్ ఏఎస్పీ శుభం నగరాలే చేతుల మీదుగా మొత్తం ₹6.8 లక్షల విలువ గల 32 మొబైల్ ఫోన్లు యజమానులకు తిరిగి అందజేశారు.