KMM: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పోలీస్, తహసీల్దారుకు జాతీయ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మల్లారపు ఉపేందర్ ఇవాళ అక్రమ ఇసుక తోలకాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిర్లక్ష్యంతో అతి వేగంగా గ్రామాలలో ఇసుక ట్రాక్టర్లులను తిరుగుతున్నాయని వాపోయారు. అతివేగంతో గ్రామస్థులు జంకుతున్నారని తెలిపారు. ఇసుకను తరలించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.