MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ శనివారం సెలవు దినం కావడంతో మత్స్యకారులు, వలస కార్మికులు చేపల వేటకు ఎగబడ్డారు. చేపలు సమృద్ధిగా దొరుకుతుండటంతో వేటగాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో, చేపలు పట్టేటప్పుడు పిల్లలను వెంట తీసుకెళ్లవద్దని పోలీసులు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు.