కర్ణాటకలో సీఎం మార్పుపై వస్తున్న మీడియా కథనాలపై Dy CM డీకే శివకుమార్ మండిపడ్డారు. ‘ఈ ఏడాది చివరినాటికి మార్పు తథ్యం’ అంటూ తన గురించి వస్తున్న కథనాలను ఖండించారు. ‘నేను సీఎం అయ్యే సమయం దగ్గరపడింది అని ఎక్కడా అనలేదు. నా తలరాత ఏంటో నాకు తెలుసు, నాకేం తొందరలేదు’ అని డీకే వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని మీడియాను హెచ్చరించారు.