WGL: నర్సంపేట మండలం ముత్తోజిపేట శివారులో గంజాయిని విక్రయించడానికి తరలిస్తున్న ఇద్దరిని ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడిలో రూ. 75 వేల విలువైన కేజిన్నర గంజాయితో పాటు ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు సీజ్ చేశారు. నిందితులు బొమ్మెర రమేష్, పాడ్య రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.