ADB: ఖానాపూర్ పట్టణంలోని రాజీవ్ నగర్ కాలానికి చెందిన గంధం సుమన్ గారి భార్య రజిత వైద్య ఖర్చుల నిమిత్తం టెన్త్ క్లాసు మిత్రులు రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. రజిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అరుణోదయ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాయిని సంతోష్, టెన్త్ స్నేహితులు పాల్గొన్నారు.