హనుమకొండ: జిల్లా కాజీపేట మండల కేంద్రంలో భూ నిర్వాసితులతో పాటు నిరుద్యోగ యువతకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్‌తో ఇవాళ ప్రజా సంఘాల కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు జంపాల రమేష్ ఆధ్వర్యంలో పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.