సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-17 పోటీలు మెదక్ వెస్లీ కళాశాలలో శుక్రవారం నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బోనాఫైడ్ ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.