BDK: భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఇవాళ వారి చాంబర్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఆదివాసి గిరిజన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లుపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగే విధంగా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులను మ్యూజియం సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు.