ASF: వాంకిడి మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే వారసంత వేలం పాటను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి శివకుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలం జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు నిర్ణీత ధరావత్తు సొమ్మును చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.